Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు

మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ద

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (17:50 IST)
* మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు
* రాష్ట్ర శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
 
సచివాలయం, జనవరి 26 : మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యమొచ్చి 71 ఏళ్లు ర్తవుతున్నాయన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియాకు గుర్తింపు లభించిందన్నారు. 
 
దేశంలోని 137 కోట్ల మంది కుల, మతాలకు అతీతంగా కృషి చేస్తే, రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలన్నారు. ప్రధానమంతి నరేంద్ర మోడి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్నారు. 
 
మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అదే నెల ఆఖరు వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ  కార్యక్రమంలో అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments