Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీ బీజేపీకి కటీఫ్ ఇవ్వాలని భావి

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (14:07 IST)
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీ బీజేపీకి కటీఫ్ ఇవ్వాలని భావిస్తున్న వేళ.. ఏపీ బీజేపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఎప్పుడూ రెండెకరాల రైతును అంటోన్న ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. 
 
ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని వీర్రాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాని సోము వీర్రాజును ఎమ్మెల్సీగా చేసింది టీడీపీనేనని తెలిపారు. 
 
వీర్రాజు వైకాపాకు ఎంతకు అమ్ముడుపోయారని అడిగారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments