Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక తాడో.. పేడో తేల్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఇకపై తాడో.. పేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీకి చెందిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.

ఇక తాడో.. పేడో తేల్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన
, శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:51 IST)
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఇకపై తాడో.. పేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీకి చెందిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై చంద్రబాబుతో పాటు.. పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
 
ముఖ్యంగా, అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విభజన హామీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసే విషయంలో పార్టీ నేతలకు ఎలాంటి పరిమితులు పెట్టలేదు. ఎన్డీయేలో మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ విభజన చట్టంలో ఉన్న హామీలకు కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై తెలుగుదేశం పార్టీ ఇక తాడో.. పేడో అన్న రీతిలో రాజకీయ అడుగులు వేసేలా ఆదేశించినట్టు తెలుస్తోంది.
 
నిజానికి ఏపీలో కొద్దిరోజులుగా రాజకీయాల్లో కీలకమైన మార్పులు చేసుకుంటున్నాయి. ఏపీ పట్ల కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. విభజన హామీల అమలు విషయంలో ఎలాంటి ముందడుగు వేయడంలేదు. పైగా పోలవరం వంటి ప్రాజెక్టులకు అంతంతమాత్రం సాయం చేస్తూ లేఖలతో ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఇకపై తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ఆదివారం జరిగే పార్టీ కీలక సమావేశంలో దీనిపై ఓ స్పష్టత రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే