Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ పెట్రోలింగ్ వాహనం సైరన్ విని మృత్యువాత.. ఎలా?

పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విని ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. అదేంటి.. సైరన్ విని ఎలా చనిపోయారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌ గ్రామానికి చెందిన శ్రావణ్ క

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (15:27 IST)
పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విని ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. అదేంటి.. సైరన్ విని ఎలా చనిపోయారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొలాల పక్కన బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు.
 
ఇంతలో అటుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఆ వాహనం సైరన్ చప్పుడు విని శ్రావణ్‌తో పాటు స్నేహితులంతా తలో దిక్కుకు పరుగులు తీశారు. చీకట్లో వ్యవసాయ బావిని గమనించక శ్రావణ్ అందులో పడిపోయాడు. శ్రావణ్ కోసం అతడి స్నేహితులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు పట్టుకెళ్లి ఉంటారని అందరూ భావించారు. ఇదే విషయంపై బుధవారం ఉదయం వెళ్లి విచారించగా తాము తీసుకురాలేదని పోలీసులు సమాధానం చెప్పారు. 
 
దీంతో మరోసారి శ్రావణ్ కోసం మొగ్దుంపూర్ వైన్స్ పరిసరాల్లో గాలించారు. ఈ గాలింపులో ఓ బావిలో శ్రావణ్ మృతదేహం కనిపించింది. శ్రావణ్ మరణ వార్తతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే.. పోలీసు పెట్రోలింగ్ భయంతో కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఇప్పటివరకు ముగ్గురు వేర్వేరు ఘటనల్లో బావుల్లో పడి చనిపోవడం గమనార్హం. 
 
కాగా, మృతుని స్వస్థలం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్. స్థానిక నిగమ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుకుంటూ మొగ్దుంపూర్ హాస్టల్లో ఉంటున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments