Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం గ్రూపు-2 మెయిన్స్ రాత పరీక్ష ఆదివారం జరిగింది. ఈ పరీక్షను నిర్వహించరాదంటూ అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు చేసిన ఆందోళనలను ఏపీపీఎస్సీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ముందుగా ప్రకటించినట్టుగానే ఈ పరీక్ష ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు రాసేందుకు ఓ యువతి పెళ్లి దుస్తుల్లోనే పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షరాసి వెళ్లింది. 
 
తిరుపతి పద్మావతి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఓ యువతి పెళ్లి మండపం నుంచి పెళ్లి దుస్తుల్లో తలపై జీలకర్రబెల్లంతోనే పరీక్షా కేంద్రానికి వచ్చారు. ఈ పరీక్ష కోసం ఆమె పరీక్షా కేంద్రానికి ఉదయం 6 గంటల ప్రాంతానికే చేరుకున్నారు. 
 
మరోవైపు, ఈ గ్రూపు-2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఏపీపీఎస్సీ మాత్రం వీరి విన్నపాలు, ఆందోళనను ఏమాత్రం పట్టించుకోలేదు. విశాఖ జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని మోసం చేశారంటూ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారంతా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 
 
అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్యాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేస్తూ ఈ పరీక్షను యధావిధిగా నిర్ణయించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments