Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

Advertiesment
arrest

ఠాగూర్

, ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్నప్పటికీ వైకాపా నేతలు మాత్రం ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. గత ఐదేళ్లపాటు వైకాపా పాలనలో రెచ్చిపోయిన వైకాపా నేతలు ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ వారు రెచ్చిపోతున్నారు. ఫలితంగా కిడ్నాప్‌లు, దాడులు, హత్యలు యధేచ్చగా చేస్తున్నారు. తాజాగా ఈ నెల 5వ తేదీన కార్పెంటర్ షేక్ మస్తాన్ వలిని పట్టపగలే కారులో బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో వైకాపా కౌన్సిలర్ అహ్మద్ బేద్ ఉన్నారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నెల 5వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ మస్తాన్ వలిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న అహ్మద్ బేగ్... డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఆ తర్వాత కారులో ఎక్కించుకుని చితకబాది, రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత తెనాలిలో తీసుకొచ్చి వదిలిపెట్టాడు. బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అహ్మద్ బేగ్‌పై గతంలో రెండు కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో పలు దౌర్జన్యాయలకు పాల్పడటంతో అతనిపై రౌడీషీట్ కూడా తెరిచారు.
 
అయితే, కార్పెంటర్ కిడ్నాప్ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అహ్మద్, అతనికి సహకరించిన రహమాన్ తెనాలికి వచ్చినట్టు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్ ఇర్ఫాన్, షేక్ హుమయాన్ క్రిస్టీ ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?