Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండారు దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం.. భోజనం చేస్తూ....

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందారు. 21 యేళ్ళ వైష్ణవ్‌కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తనువుచాలించాడు.

Webdunia
బుధవారం, 23 మే 2018 (08:28 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందారు. 21 యేళ్ళ వైష్ణవ్‌కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తనువుచాలించాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు.
 
అక్కడ చికిత్స పొందుతూ అర్థరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. వైష్ణవ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 
 
ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇంత చిన్న వయసులో తమను వదిలి వెళతాడని కలలో కూడా ఊహించలేదని దత్తాత్రేయ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments