Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని మోదీ జ‌న్మ‌దినాన‌... పారిశుధ్య కార్మికుల‌కు పాద‌సేవ‌

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (11:16 IST)
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్ర‌ధాని మోదీ జ‌న్మ‌దిన వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించింది. విజయవాడలోని చిట్టి నగర్ లోని నగరాల కళ్యాణ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వ‌హించారు. గొలగాని ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను బహూకరించి ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వారికి పాద సేవ చేశారు. కార్మికుల కాళ్ళు క‌డిగి, కండువాతో తుడిచారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఈ సంద‌ర్భంగా మాట్టాడుతూ, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవడం గర్వ కారణమ‌న్నారు. గొలగాని చారిటబుల్ ట్రస్టు అధినేత గొలగాని రవి కృష్ణ ఔదార్యం తో నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు బహూకరించార‌ని చెప్పారు.
 
 గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా భారతదేశం అభివృద్ధి వైపు దూసుకుపోతోంద‌ని, విజయవాడలో రహదారుల అభివృద్ధి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు మంజూరు చేశార‌ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నార‌ని, ముఖ్యమంత్రి దానిని అభినందించలేక పోతున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల‌ని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం గుర్తించాల‌న్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments