Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండపల్లి పీర్ల పంజాను దర్శించిన బిజెపి నాయ‌కులు

Advertiesment
కొండపల్లి పీర్ల పంజాను దర్శించిన బిజెపి నాయ‌కులు
విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:57 IST)
మొహరం పండగ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖిల్లా రోడ్ లో ఏర్పాటు చేసిన పీర్ల పంజాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సందర్శించారు.

ఆయనతో పాటు ఎమ్మెల్సీ మాధవ్, పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు బబ్బురి శ్రీ రామ్, బిజెపి మైలవరం ఇంచార్జ్ నూతలపాటి బాల, బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, మౌలాలి, నాగుల్ మీరా, జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఇతర నాయకులు పాల్గొన్నారు. బిజెపి విజయవాడ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా కార్యదర్శి సుభాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా అతిథులను సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు.

అనంతరం పీర్ల పంజా వద్ద దేశం సౌభాగ్యంగా ఉండాలని ప్రజలందరూ కరోనా కష్టాలు తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ. సత్యం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని మహమ్మద్ ప్రవక్త మనవలు చూపిన మార్గంలో ముస్లింలందరూ నడవాలని, అల్లా దయతో భారత దేశం మొత్తం సుభిక్షంతో వర్ధిల్లాలని కోరుకున్న మని, కొండపల్లి పంజా ను సందర్శించడం ఆనందకరం అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షర్మిలకు షాకిచ్చిన ఇందిరా శోభన్ : పార్టీకి గుడ్‌బై