Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే బీచ్‌లో వివాహిత మిస్సింగ్: గాలింపు కోసం కోటి ఖర్చు, కానీ ఆమె ప్రియుడితో నెల్లూరులో...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (21:25 IST)
విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో ఓ వివాహిత మిస్సింగ్ అయిన కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈమె తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టు తేలింది. ఈ వివాహిత కోసం 36 గంటల పాటు పోలీసులు గాలించారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా, అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

 
ఈ వివాహిత పేరు సాయిప్రియ. ఈమె బీచ్ తీరంలో అలలు సముద్రంలోకి కొట్టుకునిపోయివుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్టు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి పారిపోయినట్టు తేలింది. 

 
ఈమె భర్త శ్రీనివాస్‌తో జరిగిన వివాహం కంటే సాయి ప్రియ నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తిని ప్రేమించింది. పైగా, వివాహానికి ముందే ప్రియ రెండుసార్లు తన ప్రియుడు రవితో కలిసి పారిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేయడంతో సాయిప్రియ బలవంతంగా శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ప్రియుడిని మాత్రం మరిచిపోలేక పోయింది. 

 
ఈ క్రమంలో శ్రీనివాస్ హైదరాబాద్ నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తుండటంతో అక్కడే కాపురం పెట్టింది. అదేసమయంలో తన ప్రియుడితో మాత్రం టచ్‌లో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ హైదారాద్ నగరం నుంచి విశాఖకు వచ్చింది.

 
ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ వారి రెండో వివాహ వేడుక కోసం శ్రీనివాస్ విశాఖకు వచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు రవికి సాయిప్రియ సమాచారం ఇచ్చింది. అక్కడ నుంచి పక్కా ప్లాన్‌తో సాయిప్రియ తన ప్రియుడు రవితో కలిసి పారిపోయింది. 

 
తన భార్య కనిపించకపోవడంతో శ్రీనివాస్ తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నావికా సిబ్బంది సహకారంతో హెలికాప్టరు ద్వారా కూడా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇందుకుగాను కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments