Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల ప్రియకు హ్యాండిచ్చిన చంద్రబాబు? జగన్ - పవన్‌ల వైపు చూపు

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (15:08 IST)
భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిలప్రియా రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అయితే, ఈమె అధికార పార్టీలో మంత్రిగా ఉన్నారేగానీ, తన అనుచరుల అరెస్టులను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన సంజీవ నాయుడిని అరెస్టు చేసి పీడీయాక్ట్ ప్రయోగించారు. 
 
ఈ చర్యతో ఆమె తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. దీంతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించివేశారు. అదేసమయంలో కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనగా, ఈ కార్యక్రమానికి అఖిల ప్రియా హాజరుకాలేదు. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత భూమా అఖిల ప్రియా రెడ్డిని తన మంత్రివర్గంలోకి చంద్రబాబు తీసుకున్నారు. అంతేనా, తన సోదరుడుకి నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వగా, ఆయన కూడా టీడీపీ తరపున గెలుపొందారు. పైగా, తల్లిదండ్రులను కోల్పోయిన భూమా అఖిల ప్రియా రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్‌లు హామీ ఇచ్చారు. కానీ, ఇపుడు అఖిల ప్రియాకు పొమ్మనకుండా పొగబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments