Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్సీపీని శరద్ పవార్ నడిపించడం లేదు.. మునాఫ్ హకీ రిజైన్

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ వ్యవస్థాక సభ్యుల్లో ఒకరైన మునాఫ్ హకీం పార్టీకి రాజీనామా చేశారు. పైగా, ఆయన సంచలన ఆరోపణలు చ

Advertiesment
ఎన్సీపీని శరద్ పవార్ నడిపించడం లేదు.. మునాఫ్ హకీ రిజైన్
, ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (12:50 IST)
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ వ్యవస్థాక సభ్యుల్లో ఒకరైన మునాఫ్ హకీం పార్టీకి రాజీనామా చేశారు. పైగా, ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
 
ఎన్.సి.పిని శరద్ పవార్ నడిపించడం లేదనీ, మరెవరో నడిపిస్తున్నట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయన్నారు. దీనివల్ల పార్టీ నియంత్రణ మరెవరి చేతుల్లోనే ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
 
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ సర్కారును ఓ కుదుపు కుదుపుతున్న రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం విషయంలో మోడీ సర్కారుకు శరద్ పవార్ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన తారిఖ్ అన్వర్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. 
 
తాజాగా మహారాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీల్లో ఒకరైన మునాఫ్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలన్న నిర్ణయాన్ని పార్టీ 2014లోనే తీసుకుందన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ అనుకూల రాగం అందుకుందని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. తీవ్ర మనస్తాపంతోనే పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవానికి మూడు రోజులు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు... ఎక్కడ?