దోమలు కుట్టి చర్మం దద్దుర్లు, దురదలా.. చింతపండు గుజ్జుతో..?
						
		
						
				
ఈ కాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వలన చర్మమంతా దద్దుర్లు, దురదగా ఉంటుంది. ఇవి కుట్టినప్పుడు అంతగా నొప్పి తెలియదు. కానీ కాసేపటి తరువాత నొప్పి ఎక్కువై చర్మం ఎర్రగా మారుతుంది. దోమల ప్రభావం వలన వాటి నుండి ఏర్పడిన దద్దుర్లు తొలగిపోయే
			
		          
	  
	
		
										
								
																	ఈ కాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వలన చర్మమంతా దద్దుర్లు, దురదగా ఉంటుంది. ఇవి కుట్టినప్పుడు అంతగా నొప్పి తెలియదు. కానీ కాసేపటి తరువాత నొప్పి ఎక్కువై చర్మం ఎర్రగా మారుతుంది. దోమల ప్రభావం వలన వాటి నుండి ఏర్పడిన దద్దుర్లు తొలగిపోయేందుకు ఈ క్రింద తెలుపబడిన పదార్థాలు చాలా ఉపయోగపడుతాయి. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం.
	
 
									
										
								
																	
	 
	. 
	వాముని వేయించుకుని పొడిచేసి అందులో కొద్దిగా బెల్లం కలిపి ఉండల్లా చేసుకుని రోజూకు రెండుపూటలా సేవిస్తే దద్దుర్ల వలన ఏర్పడే మంట తొలగిపోతుంది. రాగిపాత్రలో కాస్త చింతపండు గుజ్జును నానబెట్టుకుని ఉంచుకోవాలి. దోమట కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ ప్రాంతాలో పూతలా వేసుకోవాలి. ఇలా చేయడం వలన దద్దుర్లు, దురదలు తగ్గు ముఖం పడుతాయి. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	అల్లం ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ అల్లం చిన్న ముక్కలుగా కట్‌చేసి వీటిల్లో కొద్దిగా సైంధవ లవణాన్ని కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మిరియాలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. వీటిని పొడిచేసుకుని వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పొడిని కలుపుకుని ఆహారంగా తీసుకుంటే దద్దుర్లు తగ్గిపోతాయి