Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దాండియా మెగా ఈవెంట్‌కు బీ రెడీ

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (18:27 IST)
దాండియా వేడుకకు విజయవాడ నగరం సన్నద్ధం అవుతోంది. ఈ నెల 28న లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో  గార్బా, దాండియా 2019 మెగా ఈవెంట్  జరగనుండగా ఇందుకు అవసరమైన శిక్షణ చురుకుగా సాగుతోంది.

చిన్నారుల మొదలు, యువతీ యువకులు, పెద్దలు విలువైన బహుమతులు గెలుచు కునేందుకు పోటీపడి మరీ అభ్యాసం చేస్తున్నారు. బెంజి సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో నిరంతర శిక్షణా కార్యక్రమం జరగుతుండగా  ఈ గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాలకు మంచి స్పందన లభిస్తోంది. 

క్రియేటివ్ సోల్  కల్చరల్ సొసైటీ నేతృత్వంలో గత రెండు సంవ్సరాలుగా నగరంలో దాండియా వేడుక జరుగుతుండగా, ఇది మూడో సారి. 28వ తేదీ నాటి మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందించనున్నారు.

ప్రస్తుత కార్యశాల లో ఉదయం 10గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగుతున్న శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని అభ్యాసం చేస్తున్నారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, హోరెత్తించే వాద్యంలతో  మెగా ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా,  గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖనాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వివరాలకు 9849468498, 8317556636, 9121605288 నెంబర్లతో సంప్రదించవచ్చు.

స్ధలా భావం వల్ల ఈవెంట్ ప్రవేశం కోసం నిర్ధేశించిన ఎంట్రీ టిక్కెట్లు పరిమితంగానే ఉన్నాయని, జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో 26 సాయంత్రం వరకు ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను  ఆంధ్రప్రదేశ్ కు  పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును చివరగా మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని క్రియోటివ్ సోల్  వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ ఈ సందర్భంగా తెలిపారు. కళలతో దేశసమైఖ్యతను చాటేలా  గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు.

విజయవాడ యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 21 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

ఇందుకోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కలిగిన శిక్షకులను రప్పించామని సుమన్ మీనా తెలిపారు. ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు రూ.లక్షకు పైబడిన బహుమతులను అందిస్తున్నామని నేహా జైన్ పేర్కొన్నారు.

దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని నిర్వాహకులు వివరించారు. కార్యక్రమ ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్  వ్యవహరిస్తుండగా, సెప్టెంబరు 28 నాటి మెగా ఈవెంట్ కు ప్రమెషన్ గా ప్రతి వారం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేవర'తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ - జోరు చూపలేకపోయిన శ్రీదేవి తనయ

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. మెగాస్టార్ చిరంజీవి దూరం.. ఎందుకో?

Revanth reddy : సిని హీరోలు ప్రభుత్వపథకాలకు ప్రచారం చేయాల్సిందే ?

నిఖిల్ చిత్రం ది ఇండియా హౌస్ నుంచి సతి గా సాయి మంజ్రేకర్‌

రేవంత్ రెడ్డి ని కలిసేది పెద్ద నిర్మాతలేనా? వేడుకలకు బ్రేక్ పడనుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments