ఆవుల మృతిపై పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేధిక ప్రకారం టాక్సిసిటి (విషప్రయోగం) అని తేలింది. గడ్డి మినహా ఎలాంటి ఆహారం పొట్టలో లేవని పశు వైద్యులు నిర్ధారించారు. టాక్సిసిటీ కారణంగా శరీరం లోపల అవయవాలపై రక్తపు చారలు, ఊపిరితిత్తులు, గుండెపై అక్కడక్కడా రక్తపు చారలు వున్నాయని వైద్యులు తెలిపారు.
ఊపిరితిత్తుల్లోకి చేరిన నీరు టాక్సిసిటీ కారణంగానే ముక్కు లోంచి రక్తం బయటికి వచ్చిందని..ఇందుకు బ్లోటింగ్ (పొట్ట ఉబ్బరం) కాదని వైద్యులు తేల్చారు. పోస్ట్ మార్టం సమయంలో ఆవుల కడుపులో గడ్డి తప్ప ఇతర పదార్థాలేవీ లేవని చెప్పారు.
తాడేపల్లి గోశాలలో వంద గోవులు చనిపోవడం బాధాకరమని రాజాసింగ్, బీజేపీ నేత అన్నారు. వంద ముగజీవాలు చనిపోయినా అక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.
ముగజీవాల మృతిపై విచారణ జరిపి ఏం జరిగిందో ప్రజలకు వివారించాలని తెలిపారు. దురుద్దేశ్యలతోనే కొందరు కావాలని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది
.
ఈ రోజు లేదా రేపు తాడేపల్లి గోశాలకు వెళ్లి నిజాలను తెలుసుకుంటానని చెప్పారు. గోవుల మృతికి కారణమైన వారిని
కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.