Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు
, గురువారం, 8 ఆగస్టు 2019 (21:56 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం విజయవాడ నగరంలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ పేరుతో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దక్షిణ కొరియా, యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే ఈ సదస్సు ముఖ్య ఉద్ధేశ్యం. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు లక్ష్యం. 
 
రేపు ఉదయం 10గంటలకు విజయవాడ నగరంలోని హోటల్‌ తాజ్‌ గేట్‌వేలో ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ సదస్సు  ప్రభుత్వ పథకాలు, విధానాలను  ద్వారా ప్రపంచ దేశాలకు తెలియచేయనున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అవుతారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.  
 
సదస్సులో పాల్గొనేందుకు యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమీషనర్లు, ఉన్నతాధికారులు వస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: కుల్‌భూషణ్‌ కేసుపై పాక్ ఆంక్షలు