Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదు.. ఆయుష్ కమిషనర్

Webdunia
సోమవారం, 31 మే 2021 (18:09 IST)
కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు మందు వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితులకు ఇచ్చే మందు ఆయుర్వేదం కాదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు వెల్లడించారు. ముఖ్యంగా, కంటి చుక్కల మందు వల్ల హాని జరగదన్న విషయం నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. దీనిపై పూర్తి ఆధారాలకు మూడు వారాల సమయం పట్టొచ్చని చెప్పుకొచ్చారు. 
 
నిజానికి ఈ మందు పంపిణీకి ఏపీ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఆనందయ్య మందు వాడటం వల్ల కరోనా తగ్గిందనడానికి నిర్దిష్ట ఆధారాలు లేవన్నారు. అలాగే, ఔషధం వల్ల దుష్ఫలితాలు కానీ, నష్టం జరిగిందన్న ఆధారాలు కూడా లేవన్నారు. 
 
ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదని రాములు నాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దాన్ని ఆయుర్వేద ఔషధంగా గుర్తించడంలేదని అన్నారు. అయితే, ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని వెల్లడించారు. 
 
తద్వారా ఎక్కువమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామని వివరించారు. అయితే, వచ్చే గురువారం హైకోర్టు ఈ కేసులో తుది తీర్పును వెలువరించనుందని ఆ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఔషధం పంపిణీపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments