Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక దీపోత్సవానికి హాజరు కండి: కర్ణాటక సిఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (21:47 IST)
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవ రాజ్ బొమ్మైని ఆహ్వానించారు. తప్పకుండా హాజరవుతానని సిఎం చెప్పారు.
 
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగా అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగారు.

ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు. 
 
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 19వ తేదీ తిరుపతి, 22వ తేదీ బెంగుళూరు, 29వ తేదీ విశాఖపట్నం లో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని సుబ్బారెడ్డి వివరించారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గత నెల 12వ తేదీ ఎ పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎస్వీబీసీ కన్నడ ఛానల్  ప్రారంభించామని చైర్మన్ తెలిపారు. ఈ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని సుబ్బారెడ్డి వివరించారు.

కన్నడ చానల్ లో దాస సాహిత్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి టీటీడీ ఛైర్మన్ ను కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు.

టీటీడీ చేప్పట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments