Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక దీపోత్సవానికి హాజరుకండి... కర్ణాటక సిఎంకు టీటీడీ ఆహ్వానం

కార్తీక దీపోత్సవానికి హాజరుకండి... కర్ణాటక సిఎంకు టీటీడీ ఆహ్వానం
విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (14:39 IST)
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22న బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైని ఆహ్వానించారు. టీటీడీ కార్య‌క్ర‌మానికి తప్పకుండా హాజరవుతానని సిఎం చెప్పారు. 
 
 
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగా అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు. 
 
 
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 19వ తేదీ తిరుపతి, 22వ తేదీ బెంగుళూరు, 29వ తేదీ విశాఖపట్నంలో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని సుబ్బారెడ్డి వివరించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గత నెల 12వ తేదీ ఎ పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎస్వీబీసీ కన్నడ ఛానల్  ప్రారంభించామని చైర్మన్ తెలిపారు. 
 
 
ఈ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని సుబ్బారెడ్డి వివరించారు. కన్నడ చానల్ లో దాస సాహిత్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి టీటీడీ ఛైర్మన్ ను కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. టీటీడీ చేప్పట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. టీటీడీ పాలకమండలి సభ్యులు శశిధర్, విశ్వనాథ రెడ్డి తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పంలో దొంగ ఓటర్లను మావాళ్ళు రాత్రే పట్టుకున్నారు...