Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిలతీర్థంలో ఫోటోగ్రాఫర్ వెంటపడ్డ అమిత్ షా.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (20:19 IST)
కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోటోగ్రాఫర్ వెంట పడటమేంటి అనుకుంటున్నారా.. సాధారణంగా విఐపిల దగ్గరే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంటే తిరుగుతుంటారు. మూడురోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన అమిత్ షా తిరుగు ప్రయాణంలో తిరుపతిలోని కపిలతీర్థం ఆలయాన్ని దర్సించుకున్నారు. 

 
ఆలయం వద్ద టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కేంద్రమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సంధర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న యాగంలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను టిటిడి ఉన్నతాధికారులు అందజేశారు. అలాగే కపిలేశ్వరస్వామి స్ధలపురాణాన్ని తెలిపే పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు. 

 
అయితే ఆలయం నుంచి బయటకు వెళ్ళే సమయంలో కపిలతీర్థంను చూసిన అమిత్ షా ఆశ్చర్యపోయారు. కొండల మధ్య నుంచి వచ్చే నీటిని చూసిన అమిత్ షా ఆలయం చుట్టుప్రక్కల వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆనందానికి లోనయ్యారు. వెంటనే ఫోటోగ్రాఫర్ ఎక్కడా అంటూ గట్టిగా పిలిచారు.

 
అంతేకాదు ఫోటోగ్రాఫర్‌ను వెతికారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఫోటోగ్రాఫర్‌ను పిలిచి ఫోటో తీయమన్నారు. నీళ్ళు రావడంతో పాటు కపిలేశ్వరస్వామి ఆలయం కనిపించాలంటూ అమిత్ షా చెప్పారు. ఫోటో కూడా టిటిడి ఫోటోగ్రాఫర్ అలాగే తీశారు. ఈ ఫోటోను తనకు పంపించాలని కోరారు కేంద్ర హోంమంత్రి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments