అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : అచ్చెన్నాయుడు

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి అని ఆరోపించారు.
 
ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందని తెలిపారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డైరీ రైతులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ డైరికి ఏపీ డైరీ ఆస్తులను ఒక యేడాది పాటుకు ఇస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాషపై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమూల్‌కు పాలు రాకపోవడంతో కక్షగట్టారన్నారు. 
 
బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయమని నిలదీశారు. అమూల్‌కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments