Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (23:06 IST)
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాన్సాస్ ట్రస్టు కార్యకలాపాల వివరాలు ఇవ్వాలని ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అశోక్ గజపతిరాజు ఆదేశాలు జారీ చేశారు.
పదేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించిన ఫీజు వివరాలు ఇవ్వాలన్నారు.
 
ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎవరు అనుమతించారో తెలపాలి గజపతిరాజు అన్నారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

మాన్సాస్ ట్రస్టు కార్యకలాపాలపై పదేళ్లుగా ఆడిటింగ్ జరగలేదన్న ఆరోపణల దృష్ట్యా.. ఆడిట్ కోసం చెల్లించిన ఫీజు వివరాలను ఈ నెల 21వ తేదీలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులపై నివేదిక ఇవ్వాలని అశోక్ గజపతిరాజు అన్నారు. 
 
విద్యాసంస్థల బడ్జెట్ ప్రతిపాదనలను వారంలో తయారు చేయాలని, సిబ్బంది జీతాలకు చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 5లక్షల రూపాయలు దాటిన కార్యాలయ కొనుగోళ్లకు వివరాలను రెండు రోజుల్లో అందించాలని ట్రస్టు ఛైర్మన్ సూచించారు.

లీజు గడువు పూర్తయిన ట్రస్టు భూములకు వెంటనే వేలం నిర్వహించాలంటూ.. ట్రస్ట్ కార్యాలయ అధికారులకు అశోక్‌ గజపతి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments