Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసని వచ్చేస్తోంది.. హై అలర్ట్‌‌గా వుండాలి- కంట్రోల్ రూమ్ నెంబర్లివే

Webdunia
బుధవారం, 11 మే 2022 (14:32 IST)
ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో హై అలర్ట్‌‌గా ఉండాలన్నారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని కలెక్టర్లు, అధికారులకు సీఎం జగన్ సూచించారు. 
 
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించాలన్నారు.
 
ఇక విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు హోంమంత్రి తానేటి వనిత.
 
సహాయక చర్యల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు హోంమంత్రికి తెలిపారు డైరెక్టర్ అంబేద్కర్. మత్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్న హోంమంత్రి తానేటి వనిత. తీరప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
 
కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments