Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ ప్రసాద్ కి అరెస్ట్ వారెంట్

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (09:05 IST)
ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కి సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇందు టెక్ జోన్ వ్యవహారంలో ఈడీ నమమోదు చేసిన కేసులో నిమ్మగడ్డకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఈ కేసులో నిమ్మగడ్డ వ్యక్తిగతంగా హాజరుకాకపోగా.. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేయలేదు. దీంతో న్యాయమూర్తి ఈ వారెంట్‌ జారీచేశారు. 
 
నేర విచారణ చట్టం సెక్షన్‌ 317 (హాజరు మినహాయింపు) కింద పిటిషన్‌ దాఖలు చేసేందుకు తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు నివేదించారు. నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు గత వారం అరెస్టు చేసిన విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశామన్నారు.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈడీ తరఫు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను న్యాయమూర్తి కోర్టుకు పిలిచారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా.. ఈడీ తరఫు న్యాయవాది సెలవులో ఉన్నారని, కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు గడువు కావాలని కోరారు.

న్యాయవాదిని నియమించుకున్నాక మెమోపై స్పందిస్తామన్నారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 23కు వాయిదా వేశారు. కాగా.. సెర్బియా పోలీసుల కనుసన్నల్లో ఉన్న నిమ్మగడ్డను భారత్ కి రప్పించేందుకు ఆయన తరఫు న్యాయవాదులు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments