Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (20:54 IST)
ఎపిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 16వ తేది నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎపి వ్యాప్తంగా 3,87,983 మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో వ్యాక్సిన్‌ అందించనున్నారు.

ఇందుకోసం రాష్ట్రంలో 1,940 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజిరేటర్లు, వాక్‌ ఇన్‌ ఫ్రీజర్‌ గదుల ఏర్పాటు కారణంగా 1,659 చోట్ల వ్యాక్సిన్‌ వయల్స్‌ కార్టన్లను వైద్య ఆరోగ్య శాఖ భద్రపరిచింది. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్‌ యాప్‌ ద్వారా సంక్షిప్త సమాచారం అందుతుంది. వైద్య సిబ్బది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్‌ ప్రక్రియను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అత్యవసర వైద్య సిబ్బందిని నియమించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments