సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:36 IST)
సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేయనుంది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు కొనుగోలు చేయనుంది. 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించేలా ప్రభుత్వ ప్రణాళిక రూపొందించనుంది. ఈఆర్‌సీ ఆమోదించడంతో త్వరలో సెకితో ఎంవోయూ కుదుర్చుకోనుంది. 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది.
 
 
సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది. 2026 సెప్టెంబర్‌ నాటికి 10వేల మెగా వాట్లు సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ సమ్మతించింది. సౌర విద్యుత్‌ కొనుగోళ్లపై త్రైపాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వీలింగ్‌, నెట్‌ వర్క్‌ ఛార్జీలు ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఈఆర్సీ సూచించింది. 2024 నుంచి 25ఏళ్ల పాటు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 2024 సెప్టెంబర్‌ నాటికి 3వేల మెగావాట్లు, 2025 నాటికి మరో 3వేల మెగావాట్లు, 2026 నాటికి 1000మెగావాట్లు కొనుగోలుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments