Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నాయి. గత యేడాది ఈ టెన్త్ పరీక్షలను ఏడు పేపర్లతో నిర్వహించారు. ఈ యేడాది మాత్రం ఆరు పేపర్లకే పరిమితం చేశారు. 
 
సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్, నేచురల్ సైన్స్‌కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరు ఆన్సర్ బుక్‌లెట్స్ ఇస్తారు. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే ప్రీ పబ్లిక్ పరీక్షల రూపంలో ప్రాక్టీస్ చేయించారు. 
 
అయినప్పటికీ విద్యార్థుల్లో నెలకొన్న సందిగ్ధత మాత్రం తొలగిపోలేదు. అనేక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఫిజిక్స్ ఆన్సర్ బుక్‌లెట్‌లో నేచురల్ సైన్స్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులు రాశారు. ఇదే పొరపాటు పబ్లిక్ పరీక్షల్లో పునరావృత్తమైతే ఎలా అనే సందేహం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో నెలకొంది. 
 
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు 18వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 6న సెకండ్ లాంగ్వేజ్, 8న ఇంగ్లీష్, 10న మ్యాథ్స్, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్, 17న కాంపోజిట్ కోర్సు, 18న ఒకేషనల్ కోర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments