Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడవలో ధ్యానం చేస్తూ కనిపించిన ఆర్కే రోజా.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (10:59 IST)
RK Roja
ఏపీ మంత్రి ఆర్కే రోజా పడవలో ధ్యానం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సముద్ర జలాలపై బోట్ రైడింగ్ చేస్తూ, యోగా చేస్తూ ఆనందిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మంత్రి రోజా ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని మెడలో దండతో కనిపించారు.
 
మంత్రి రోజా ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదించడాన్ని ఈ వీడియో చూడొచ్చు. తరువాత, ఆమె సముద్రంలో పక్షులకు ఆహారం ఇచ్చింది. తన జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను చిత్రీకరించింది. 
 
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఆమె అయోధ్య రామమందిరాన్ని సందర్శించి శ్రీరామునికి పూజలు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అయోధ్య ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని తన అనుచరులకు చూపించారు. ఇంకా వీడియోను నెట్టింట వీడియోను షేర్ చేసింది. 
 
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ, తాను అయోధ్యను సందర్శించానని, శ్రీరాముడి జన్మస్థలంలో అడుగుపెట్టడం చాలా ఆశీర్వాదమని అన్నారు. ఆలయ స్థలంలో కాషాయ జెండాను చూపించి, అది శ్రీరాముడు జన్మించిన ప్రదేశమని చెప్పింది.
 
2024లో అయోధ్యలో శ్రీరామునికి ప్రతి ఒక్కరూ పూజలు చేయవచ్చని చెప్పిన మంత్రి రోజా.. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలను కూడా చూపించి, ఆలయ నిర్మాణం తర్వాత విగ్రహాలను అంతఃపురానికి తరలిస్తామని చెప్పారు. ఆమె చక్రతీర్థం, నైమిశారణ్యాన్ని కూడా సందర్శించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments