Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఓర్వలేక పోతోంది... వచ్చే నెల నుంచి పంచదార, కందిపప్పు: పత్తిపాటి

అమరావతి: చంద్రన్న విలేజ్ మాల్స్‌లో పేదలకు బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువకే సరుకులు లభిస్తాయని, పేదల కడుపు నిండటం ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపే వైఎస్ఆర్ సిపి నేతలకు ఇష్టం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వచ్చే నెల నుంచ

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (21:22 IST)
అమరావతి: చంద్రన్న విలేజ్ మాల్స్‌లో పేదలకు బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువకే సరుకులు లభిస్తాయని, పేదల కడుపు నిండటం ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపే వైఎస్ఆర్ సిపి నేతలకు ఇష్టం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వచ్చే నెల నుంచి రేషన్ డిపోల్లో పంచదార, కందిపప్పు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. 5, 10 కేజీల బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేసే ఆలోచన ఉందన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
రాష్ట్రంలో పేదల కడుపు నిండటమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు చంద్రన్న విలేజ్ మాల్స్ ద్వారా తక్కువ ధరలకు క్వాలిటీ ఉన్న సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్ సరుకులకు, చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ఉన్న ఇతర ఎటువంటి సంబంధమూ లేదన్నారు. రేషన్ సరుకులు ప్రభుత్వ సబ్సిడీ అందజేస్తామన్నారు. అలాగే మిగిలిన సరుకులు బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరలకు విలేజ్ మాల్స్‌లో విక్రయిస్తారన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వైఎస్ఆర్ సిపి నేతలకు ఇష్టం లేదన్నారు. 
 
పేదలు కడుపు నిండితే, ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వారు రారని, ఉన్న 4 సీట్లు కూడా పోతాయనే భయం ప్రతిపక్ష పార్టీలో ఉందన్నారు. అందుకే వైఎస్ఆర్ సిపి నేత రోజా... చంద్రన్న విలేజ్ మాల్స్ చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారన్నారు. ఎక్కడ తక్కువ ధరకు వస్తువులు లభిస్తే, వినియోగదారులు అక్కడే వాటిని కొనుగోలు చేస్తారన్నారు. అంతేగాని, చంద్రన్న విలేజ్ మాల్స్ లోనే సరుకులు కొనుగోలు చేయాలని కార్డుదారులను బలవంతం చేయడంలేదన్నారు. 
 
వినియోగదారులు తమ ఇష్టం మేరకే సరుకులు కొనుగోలు చేసుకోవొచ్చునన్నారు. చంద్రన్నవిలేజ్ మాల్స్ ద్వారా డీలర్లకు, వినియోగదారులకు మేలు కలుగుజేయలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రిక్వెట్ ప్రొఫిట్ పిలిస్తే, 8 మంది రాగా, కేవలం ఇద్దరు మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు సరుకులు పంపిణీ చేయడానికి ముందుకొచ్చారన్నారు. రిలయన్స్ సంస్థ 10 జిల్లాల్లో, ఫ్యూచర్ గ్రూప్ 3 జిల్లాల్లో సరుకులు అందజేయడానికి ముందుకొచ్చాయన్నారు. పేదలతో పాటు 28,500 డీలర్లకు మేలు కలుజేయలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 40 శాతం మేర డీలర్లకు, 60 శాతం మేర పేదలకు లబ్ధి కలగనుందన్నారు. 
 
ఎంతో ఉన్నత లక్ష్యంతో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొస్తే, ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేకపోతోందన్నారు. బయట మార్కెట్లో అరకేజీ పంచదార 6 రూపాయలకు విక్రయిస్తున్నారని వైఎస్ఆర్ సిపి రోజా అంటున్నారన్నారు. ఎక్కడ అమ్ముతున్నారో ఆమె చెబితే, అక్కడ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి, 50 శాతం సబ్సిడీకి పంచదారను అందజేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రోజాకు ఛాలెంజ్ చేస్తున్నామని, ఎక్కడ పంచదార అరకేజీ 6 రూపాయాలకు అమ్ముతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. 
 
వచ్చే నెల రేషన్ డిపోల ద్వారా అరకిలో పంచదార చొప్పున అందజేయనున్నామన్నారు. అలాగే, కందిపప్పు కూడా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 5, 10 కేజీల బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందన్నారు. దీనివల్ల బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న విమానాశ్రయానికున్న ఎన్టీఆర్ పేరునే తీసేసి, రాజీవ్ పేరు పెట్టారని, హార్టికల్చర్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టడంలో తప్పులేదన్నారు. 
 
రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపులతో సీఎం చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపించడం దారుణమన్నారు. ఆర్.ఎఫ్.పిలో ఎవరైనా పాల్గొనొచ్చునన్నారు. రివర్స్ బిడ్డింగ్ నిర్వహించినందున అక్రమాలు జరిగే అవకాశమే లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సరుకులను పంపిణీ చేయడానికి రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపులు ముందకొచ్చాయన్నారు. అందుకే వాటికి చంద్రన్న మాల్స్ కు సరుకుల పంపిణీకి అవకాశమిచ్చామన్నారు. ప్రభుత్వమిచ్చే సరుకుల తో పాటు జీసీసీ, డ్వాక్రా ఉత్పత్తులను విలేజ్ మాల్స్‌లో విక్రయిస్తారన్నారు. ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. విలేజ్ మాల్స్‌లో వస్తువుల ధరలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తోందన్నారు. 
 
మన సరుకులు తిరిగివ్వకుంటే కఠిన చర్యలు...
చంద్రన్న కానుక ద్వారా రాష్ట్రంలో ఉత్పత్తయిన కందులు, శనగులను కందిపప్పు, శనగపప్పు కార్డుదారులకు అందజేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎక్కడయినా రాష్ట్రంలో ఉత్పత్తయిన కందిపప్పు, శనగ పప్పు పంపిణీ చేయకుంటే కఠిన చర్య తీసుకుంటామన్నారు. అలా పంపిణీ చేసిన సంస్థ, డీలర్ల పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టి, వారి డిపాజిట్‌ను వాపస్ చేయబోమని మంత్రి స్పష్టంచేశారు.
 
వెబ్ ల్యాండ్లో ఇప్పటికే రైతులందరి పేర్లు నమోదు చేశామని మంత్రి తెలిపారు. రైతులు ఎంతమేర వరి, ప్రత్తి సాగు చేశారో...ఎంత ఉత్పత్తి వచ్చింది? అనే వివరాలు స్పష్టంగా ఉంటుందన్నారు. వెబ్ ల్యాండ్లో ఉన్న రైతుల నుంచి బియ్యం, ప్రత్తి కొనుగోలు చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసి, వాటిని పాలీష్ చేసి, తిరిగి షాపింగ్ మాల్‌లో విక్రయిస్తే, సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments