కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
శనివారం, 15 నవంబరు 2025 (22:50 IST)
కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళికి ముప్పుకాదని, మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం వేదికగా సీఐఐ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులోభాగంగా 'ఏఐ-భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. 
 
'ఏఐని అందిపుచ్చుకోవడానికి ఏపీ మూడు విధాలుగా ముందుకెళ్తాంది. పునఃనైపుణ్యం, పునర్నిర్వచించడం, పునఃఊహించడం ద్వారా ముందుకెళ్తున్నాం. మేం నైపుణ్యం అనే ప్లాట్‌ఫాంను రూపొందించాం. కృత్రిమ మేధ మానవాళికి ముప్పు కాదు.. మానవత్వాన్ని తీర్చిదిద్దుతుంది' అని పేర్కొన్నారు. 
 
'ఐటీ రంగం వల్లే పారిశ్రామికవేత్తలు అభివృద్ధి సాధిస్తారు. ఫుడ్ ప్రాసెసింగులో వ్యాపారవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. నెలకు రూ.50 వేలు సంపాదించే వ్యాపారవేత్త రూ.లక్ష సంపాదించేలా ప్రయత్నిస్తున్నాం. నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తుంటే.. దాన్ని రూ.25 లక్షలకు అభివృద్ధి చేసేలా పనిచేస్తున్నాం. ఇలా చేసినప్పుడే 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి చేరుకుంటాం. ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలతో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం' అని నారా లోకేశ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments