వైజాగ్ వేదికగా జరుగుతున్న సీఐఐ సదస్సులో ఇప్పటివరకు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గడిచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఇప్పటి వరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మొత్తంగా గడిచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక్కడ 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు తెలిపారు.
'ఒక ప్రణాళికతో శ్రీసిటీని ఏర్పాటు చేశాం. అభివృద్ధికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది. శ్రీసిటీ నుంచే డైకిన్, ఇసుజూ, క్యాడ్బరీ.. ప్రపంచానికి ఉత్పత్తులు అందిస్తున్నాయి. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్‌షిన్‌నకు రావాలి. త్వరలోనే శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం.
50 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడి నుంచే పనిచేస్తాయి. త్వరలోనే 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీసిటి అభివృద్ధి మోడల్‌గా మారుతుంది. 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తాం. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు భారీ ప్రణాళికలు వేస్తున్నాం' అని చంద్రబాబు అన్నారు.