Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

Advertiesment
chandrababu naidu

ఠాగూర్

, గురువారం, 13 నవంబరు 2025 (17:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్‌ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని త్వరలోనే గ్రీన్ హెడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలతో నగరాలు నీట మునుగుతున్నాయి. ఒకేచోట 40 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వంటి తీవ్ర పరిణామాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయి. ఈ ఉత్పాతాలను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రానున్న డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్, ఈయూ మరింత సమర్థంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
 
ఈ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ నౌకా నిర్మాణ రంగంలో వెనుకబడి ఉంది. ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలని ఆయన విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)