Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం - తెలంగాణ నేతల సంతాపం

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన తీవ్రగుండెపోటుకు గురికావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే, మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతితో పాటు తమ సంతాపాలను తెలిపారు. 
 
గౌతం రెడ్డి మృతి చెందారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
ఇకపోతే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత మరణం తమను కలిచివేసిందన్నారు. గౌతం రెడ్డి ఆత్మకు శాంతిచేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
తన ప్రియ మిత్రుడు మేకపాటి గౌతం రెడ్డి ఇకలేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు షర్మిల ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments