Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని ఖాకీలను జైలుకు పంపిస్తాం : హైకోర్టు వార్నింగ్

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (12:54 IST)
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని పోలీసులను లోపల(జైలు)కు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్ల లోపు జైలుశిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. అలాంటి కేసుల్లో సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలిపింది. పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలే భయపడిపోతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు నిలదీసింది.
 
సాంబశివరావును అరెస్టు చేస్తే బాధ్యలు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించని అధికారులను లోపల పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో వివరాలు అందించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణనను హైకోర్టు మంగళవారానికి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments