Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిక్కెట్‌కు సరిపడ చిల్లర ఇవ్వమన్న కండక్టర్.. దాడి చేసిన మహిళ.. ఎక్కడ?

tsrtc

ఠాగూర్

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:00 IST)
బస్సు టిక్కెట్‌కు సరిపడిన డబ్బులు ఇవ్వాలని అడిగిన ఓ ఆర్టీసీ బస్సు కండక్టరుపై ఓ మహిళ ప్రయాణికురాలు దాడి చేసింది. దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగడమే కాకుండా కండక్టర్‌ను కాలితో తన్నింది కూడా. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 25వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనవరి 25వ తేదీ ఉదయం హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళుతున్న టీఎస్‌ఆర్టీసీ బస్సులోకి ఎల్‌బీనగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఓ మహిళ ఎక్కింది. దిల్‌సుఖ్‌నగర్‌కు ఓ జీరో టిక్కెట్‌(మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే టిక్కెట్‌) ఇవ్వాలని కండక్టర్‌ను అడిగింది. ఉచిత ప్రయాణ టిక్కెట్‌ కావాలంటే ఏదైనా గుర్తింపు కార్డు చూపాలని లేనిపక్షంలో టిక్కెట్‌ కొనుగోలు చేయాలని కండక్టర్‌ సూచించారు. 
 
దీంతో కార్డులేవీ లేవంటూ రూ.500 నోటు ఇస్తూ సదరు మహిళ కండక్టర్‌తో గొడవ మొదలుపెట్టింది. టిక్కెట్‌కు సరిపడా డబ్బు ఇవ్వాలని కండక్టర్‌ అడుగగా మరింత రెచ్చిపోయి భౌతిక దాడి చేసింది. ఈ ఘటనపై హయత్‌నగర్‌ డిపో మేనేజర్‌ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి వీడియో సాక్ష్యాన్ని కూడా అందజేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరుపుతున్నారు. 
 
బొందిలో ప్రాణమున్నంత వరకు బెంగాల్‌లో సీఏఏ అమలు కాదు : సీఎం మమతా బెనర్జీ 
 
తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కానివ్వబోనని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. దేశంలో సీసీఏ అమలుకు కేంద్రం చర్యలు చేపట్టింది. మరో వారం రోజుల్లో సీసీఏను అమలు చేస్తామంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. 
 
రాజకీయ అవకాశవాదంతో భారతీయ జనతా పార్టీ సీసీఏ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తుందన్నారు. ఎవరి పౌరసత్వాన్ని లాక్కొనిపోయేందుకు అనుమతించేది లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను బీజేపీ ఇపుడు చెప్పడం పూర్తిగా రాజకీయమేనన్నారు. బెంగాల్‌ సరిహద్దుల్లో ఉంటున్నవారందరికీ తాము పౌరసత్వం ఇచ్చామని, వారు ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అన్ని ప్రయోజనాలు పొందగలుగుతున్నారని చెప్పారు.
 
సరిదద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బీఎస్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తుందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి కార్డులు స్వీకరించవద్దని హెచ్చిరంచారు. ఎన్ఆర్సీ ఉచ్చులో పడవేసేందుకు అవి సాధానాలు అవుతాయని చెప్పారు. అందువల్ల తాను బతికున్నంత వరకు బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు కానివ్వబోనని స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలోనే బీజేపీ సీఏఏ పల్లవి అందుకుందని ఆమె ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌కు అంత అహంకారం పనికిరాదు.. వైకాపాకు ముగ్గురు ఎంపీలే మిగులుతారు..