Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అశ్లీల వీడియోలు చూస్తూ అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. చంపేసిన తండ్రి.. ఎక్కడ?

murder

ఠాగూర్

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (08:24 IST)
మొబైల్ ఫోనులో అసభ్య అశ్లీల వీడియోలు చూస్తూ తనతో పాటు చదువుకునే అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చిన 14 యేళ్ల కుమారుడిని ఓ తండ్రి చంపేశాడు. పద్దతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ యువకుడు మారలేదు. పైగా, పాఠశాల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో ఆ తండ్రి మరింత ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో శీతలపానీయంలో విషం కలిపి కుమారుడితో తాగించి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగింది. హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తమ కుమారుడు కనిపించడం లేదంటూ గత నెల 13న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుర్రాడి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో విషం తీసుకోవడం వల్లే మరణించినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానించారు. 
 
కుర్రాడి తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాల్ చదువును పక్కనపెట్టేసి ఫోనులో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్లో అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోమని పలుమార్లు చెప్పినా పెడచెవిన పెట్టాడు. అదేసమయంలో స్కూలు నుంచి కూడా ఫిర్యాదులు రావడం ఎక్కువయ్యాయి. కుమారుడి ప్రవర్తనపై విసిగిపోయిన తండ్రి జనవరి 13న తన 14 ఏళ్ల కుమారుడు విశాల్‌ను బైకుపై తుల్జాపూర్ రోడ్డుతు తీసుకెళ్లాడు. 
 
అక్కడ శీతలపానీయం కొని అందులో విషం కలిపి కుమారుడికి ఇచ్చాడు. విశాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాక అతడు తిరిగి ఒంటరిగా ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిందితుడు తండ్రేనని తేలడంతో తాజాగా అతడిని కటకటాల వెనక్కి పంపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతర జరుగుతోంది.. భార్యను బలి ఇచ్చిన భర్త