Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు జడ్జీలను తప్పించాలన్న ప్రభుత్వ ఫ్లీడర్ - కుదరదన్న ఏపీ హైకోర్టు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (12:57 IST)
రాజధాని అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సోమవారం నుంచి విచారణ ప్రారంభమైంది. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. అయితే.. త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి హైకోర్టు అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ న్యాయవాది వాదనలను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. 
 
పిటిషన్లు దాఖలు చేసిన రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌దివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తంచేసింది. కక్షిదారులతోపాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments