Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డి జిల్లా పర్యటనకు హైకోర్టు అనుమతి

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమర్ ఆదేశించారు. అయితే, ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేయ‌డంతో దానిపై న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది.
 
మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే ప‌రిమిత‌మై ఉండాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. అయితే, ఆయ‌న మీడియాతో మాట్లాడ‌వ‌ద్ద‌న్న ఎస్ఈసీ ఆదేశాల‌ను మాత్రం స‌మ‌ర్థించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని చెప్పింది.
 
కాగా, ఎస్ఈసీ ఈ నెల 6న ఇచ్చిన ఉత్త‌ర్వులు ఏకపక్షంగా ఉన్నాయని పెద్దిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా, వివరాలు తీసుకోకుండా ఇచ్చిన‌ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి తిరుమలకు వస్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి పెద్దిరెడ్డి ఇప్ప‌టికే అక్క‌డ‌కు వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments