Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ ఫ్యామిలీ మెంబర్స్‌కు హైకోర్టు నోటీసులు

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (17:41 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురైంది. త్రిసూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై జేసీ కుటుంబ సభ్యులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 
 
త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్ణీత సమయంలో నిర్మించలేదని, దానికి కేటాయించిన లైమ్ స్టోన్ గనులు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రతివాదులుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమార్తె, కోడలును చేర్చి నోటీసులు జారీ చేసింది. 
 
లైమ్ స్టోన్ గనుల లీజు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులో పేర్కొంది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్‌ 30వ తేదీకి వాయిదా వేసింది. బినామీలతో జేసీ చేస్తున్న దందాపై 2011లోనే పిటిషన్ వేసినట్లు తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి చెప్పారు. తమకు న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments