Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మగిరి వేద పాఠాశాల కరోనా రోగులకు మెరుగైన చికిత్స : మంత్రి ఆళ్లనాని

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:03 IST)
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు స్విమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను, అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్ రుయాలో వెయ్యి పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హోం క్వారంటైన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించాలని, ప్రతిరోజూ వైద్యులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్విమ్స్, రుయాలో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది హోం క్వారంటైన్లో ఉన్నారన్నారు. ప్రతిరోజూ రెండు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments