Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (11:50 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరు మార్పునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో పేరు మార్పునకు సంబంధించిన బిల్లు చట్టంగా రూపాంతరం చెందింది. 
 
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చుతూ వైకాపా ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న బలం ఆధారంగా పూర్తి మెజార్టీతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. 
 
ఈ బిల్లును ఆమోదించాలని రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపించింది. దీన్ని పరిశీలించిన గవర్నర్ సోమవారం ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. కాగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో ఈ బిల్లును చట్టంగా మారుసస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫలితంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును అధికారికంగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments