Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్టుబడిదారుల సదస్సు 2023 : పెట్టుబడిదారులకు నోరూరించే వంటకాలతో విందు

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ వేదికగా పెట్టుబడిదారుల సందస్సును శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి వచ్చి  పెట్టుబడిదారులు, అథితులకు ఏపీ ప్రభుత్వం నోరూరించే వంటకాలతో విందు భోజనం వడ్డించనుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సులో అతిథుల కోసం నోరూరించే వెజ్, నాన్ వెజ్ వంటకాలు వడ్డిస్తారు. 
 
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం సమ్మిట్ ప్రారంభమయింది. సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి అతిథులు విచ్చేశారు. వీరికి నోరూరించే వంటకాలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 
 
మధ్యాహ్నం భోజనంలో గుంటూరు కోడి వేపుడు, బొమ్మిడాయల పులుసు, మటన్ కర్రీ, రొయ్యల మసాలా, చికెన్ పలావ్, వెజ్ పలావ్, క్యాబేజీ ఫ్రై, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాప్సికం కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, కుల్చా, మిర్చీ కా సలాన్, మెంతికూర-కార్న్ రైస్, టమోటా పప్పు, బీట్ రూట్ రసం, గోబీ ఆవకాయ, మజ్జిగ పులుసు, ద్రాక్ష పండ్ల పచ్చడి, నెయ్యి, వడియాలతో పాటు ఐస్ క్రీమ్, కాలా జూమూన్, జున్ను, ఫ్రూట్స్ ఉంటాయి. 
 
రెండో రోజు అయిన రేపు కూడా నోరూరించే వంటకాలు అతిథుల కోసం సిద్ధం కాబోతున్నాయి. రేపటి మెనూలో ఆంధ్ర చికెన్ కర్రీ, చేప ఫ్రై, రొయ్యల కూర, మటన్ పలావ్, ఎగ్ మసాలా, గోంగూర మటన్, రుమాలీ రోటీ, బటర్ నాన్, రష్యన్ సలాడ్స్ ఉంటాయి. వెజ్ సెక్షన్ లో కడాయ్ వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, పన్నీర్ కర్రీ, బెండకాయ-జీడిపప్పు ఫ్రై, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు ఉంటాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, అంగూర్ బాసుంది, డబుల్ కా మీఠా అందుబాటులో ఉంటాయి. 
 
ఉదయం టిఫిన్ విషయానికి వస్తే... హాట్ పొంగల్, టమోటా బాత్, ఇడ్లీ, వడ ఉంటాయి. ఉదయం స్నాక్స్ లో డ్రై కేక్, ప్లమ్ కేక్, వెజ్ బెల్లెట్, స్ఫ్రింగ్ రోల్స్, మఫిన్స్ ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ లో చీజ్ బాల్స్, కుకీస్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, బజ్జీలు, కాఫీ, టీ ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments