Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి విశాఖ వేదికగా పెట్టుబడిదారుల సదస్సు - జనసేనాని విషెస్

Advertiesment
pawan klyan
, శుక్రవారం, 3 మార్చి 2023 (08:50 IST)
ఆంధ్రప్రదే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి విశాఖ వేదికగా పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనుంది. ఈ నెల 3, 4 తేదీల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రాజకీయం కంటే రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్ ఎంతో ముఖ్యమంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వగతం పలుకుతోందని వెల్లడించారు. 
 
"మా శక్తిమంతమైన, అనుభవం కలిగిన ఏపీ యువత విమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్‌, మన యువతకు ఉపాధి లభించే అవకాశం కల్పించడంతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా తమ పెట్టుడలకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నా... ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం... ఏపీలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తిమంతమైన మానవ వనరులు, ఖనిజ సంపంద, సముద్రతీరం వంటి అంశాలను పెట్టుబడిదారులకు పూర్తిగా వివరించండి. 
 
రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి ఏవీ లేకుండా, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి. ఈ సదస్సు ఉద్దేశాలను కేవలం విశాఖకు మాత్రమే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప వంటి ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న అభివృద్ధికి గల అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించింది. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా, ఏపీ మొత్తానికి నిజమైన పెట్టుబడిదారుల సదస్సుగా మార్చండి అంటూ పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లింగమార్పిడితో అమ్మాయిగా మారిన ట్రిచాడ.. బడా పారిశ్రామికవేత్తతో వివాహం