Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (09:22 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని వైకాపా గూండాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఉండవల్లిలో ఆయన సోమవారం ఉదయం తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు. 
 
'ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. విదేశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలి' అని చంద్రబాబు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments