Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఈఏపీ సెట్ 2023 అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్

Webdunia
మంగళవారం, 9 మే 2023 (11:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీఈఏపీ సెట్-2023 హాల్ టికెట్లను దరఖాస్తుదారులు మంగళవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సెట్ నిర్వహణ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ రంగజనార్ధన, కన్వీనర్ ప్రొఫెసర్ శోభాబిందు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
సోమవారం వరకు మొత్తం 3,37,12 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఇంజనీరింగ్ 2,37,055, ఆగ్రికల్చర్, ఫార్మసికీ 99,388 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ రెండు విభాగాలకు కలిపి 979 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రూ.5 వేల ఫైన్‌తో ఈ నెల 12 వరకు, రూ.10 వేలతో 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. 
 
ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 19 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 22, 23వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 
 
19వ తేదీ ఉదయం సెషన్ మాత్రమే పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఒకటిన్నర గంట ముందు నుంచే అనుమతిస్తారని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 08554-23411, 232248 హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రతించాలని, లేదా helpdesk apeapcet 2023@gmail.com కు మెయిల్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments