Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (10:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దాదాపు 3.35 లక్షల నుంచి 5.77 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 35.33 మంది పోటీపడుతున్నారు. పీజీటీ పోస్టులకు అత్యధికంగా 152 మంది పోటీపడుతున్నారు. జూన్ ఆరు నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి ఆగస్టు రెండో వారంలో ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
ముఖ్యంగా, సెంకడరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుకు సగటున 25 మంది, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 28 మంది చొప్పున పోటీపడుతుండగా, పోస్ట్ గ్యాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో పీజీటీ పోస్టుకు ఏకంగా 152 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల ఉన్నత విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 
 
ఈ నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్ టిక్కెట్లను శనివారం అభ్యర్థులకు అందుబాటులో తెచ్చారు. ఈ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలైన హైదరాబదా్, చెన్నై, బరంపురం (ఒరిస్సా) బెంగుళూరు నగరాల్లో కలిపి మొత్తం 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. 
 
అభ్యర్థులు తమకు సౌకర్యవంతంగా ఉండే ఐదు జిల్లాలను పరీక్షా కేంద్రాల కోసం ఆప్షన్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. వారిలో 87.8 శాతం మందికి వారు కోరుకున్న మొదటి ప్రాధాన్యత జిల్లాలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. పరీక్షల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు నెల రెండో వారంలో డీఎస్సీ ఫలితాలను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు వెల్లడించారు. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో చాలా మేరకు ఉపాధ్యాయుల కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments