Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల్ కోసం టెంప్ట్ అయితే ఇరుక్కోక తప్పదు: ఎపీ డిజిపి గౌతం సవాంగ్ వార్నింగ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:40 IST)
ఎపీ పోలీస్ శాఖలో సిబ్బంది అవినీతిపై డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫర్లకు టెంప్ట్ అవటం వలనే పోలీసు శాఖలో అవినీతి బయటపడుతుందని, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పోలీసు సిబ్బంది టెంప్ట్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. తొందరపడితే కేసుల్లో ఇరుక్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
 
అంతేకాదు, ఇప్పటివరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం నమోదు చేసిన కేసుల్లో 53 మంది పోలీసుల పాత్ర కూడా ఉందని వారిపై కూడా కేసులు నమోదు చేశామని డీజీపీ స్పష్టం చేశారు. సొంత శాఖలలో పని చేస్తున్న వారిపై కేసులు పెట్టటం బాధగా ఉన్నా తప్పటం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ఇలాంటి అవినీతి పనులకు పోలీసులు దూరంగా ఉండాలని డీజీపీ పిలుపునిచ్చారు. పోలీసు శాఖలో సత్ప్రవర్తన, ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించటంపై ఎపీలోని 76 వేల మంది పోలీసులతో వెయ్యి ప్రాంతాల నుండి ఒకేసారి డీజీపీ ఆన్లైన్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్లకు ఎవరూ రావాలని కోరుకోరనీ, తీరని అన్యాయం జరిగినప్పుడు మాత్రమే బాధితులు పోలీస్ స్టేషన్ తలుపు తడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments