Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కసి మొత్తం దానిమీదే... అందుకే పాదయాత్ర... ఉపముఖ్యమంత్రి కేఈ

ప్రతిపక్షనాయకుడి అవినీతి చరిత్ర దేశం ఎల్లలు దాటి భూగోళం అంతా వ్యాపించిందనీ, ఈ విషయం ప్యారడైజ్ పేపర్స్ ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. అవితీ ముద్ర వేసుకుని దాన్ని మోస్తున్న జగన్ మోహన్ రెడ్డి అవినీతిని అరికడతాననడం ఈ దశ

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (15:58 IST)
ప్రతిపక్షనాయకుడి అవినీతి చరిత్ర దేశం ఎల్లలు దాటి భూగోళం అంతా వ్యాపించిందనీ, ఈ విషయం ప్యారడైజ్ పేపర్స్ ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. అవితీ ముద్ర వేసుకుని దాన్ని మోస్తున్న జగన్ మోహన్ రెడ్డి అవినీతిని అరికడతాననడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. ఆయన తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. 
 
జగన్ పాదయాత్ర చూసి అన్న వస్తున్నాడు కాదు, మనల్ని దోచుకోవడానికి దొంగ వస్తున్నాడంటూ జనం పారిపోతున్నారని విమర్శించారు. బాబు పోతే జగన్ మోహన్ రెడ్డికి జాబ్ వస్తుంది, ఆ తరువాత జనం నెత్తిన టోపి వస్తుందని ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఆయన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
 
ప్రతిపక్షనాయకుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి సీఎంని చేయండంటూ  పాదయాత్ర మొదలుపెట్టాడు. జగన్ కసి మొత్తం సి.ఎం కుర్చీకోసమేనని, ఆయనకు సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ప్రతిపక్షనాయకుడికి చట్టసభలన్నా, న్యాయ వ్యవస్థలన్నా గౌరవం లేదన్నారు. 
 
ముఖ్యమంత్రి మీద నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా పోలవరంతో పాటు ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments