Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్ రెడ్డి ఫిలమెంట్ ఎగిరిపోయే వ్యాఖ్యలు... ఉత్తమ్ అలా అనేశారే...

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటయా అంటే... ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాస్త ఊపిరి వచ్చేలా ఈ

రేవంత్ రెడ్డి ఫిలమెంట్ ఎగిరిపోయే వ్యాఖ్యలు... ఉత్తమ్ అలా అనేశారే...
, సోమవారం, 6 నవంబరు 2017 (19:24 IST)
చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటయా అంటే... ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాస్త ఊపిరి వచ్చేలా ఈమధ్య కొందరు నాయకులు ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఒకరు. ఆయన చేరికతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో చాలా బలంగా మారిపోతుందని అంతా అనుకున్నారు. 
 
ఆ లెక్క ఎలా వుంటుందో తెలియదు కానీ అప్పుడే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలు ఎర్తులు మొదలయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు విసురుతున్నారు సీనియర్ నాయకులు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వుండటం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చాలా ప్రాముఖ్యతనిచ్చారు.... రాబోయే కాలంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కట్టబెట్టే అవకాశం వున్నదా అనే ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. 
 
ఈ మాటలు వింటే రేవంత్ రెడ్డి ఫిలమెంట్ ఎగిరిపోతుందోమో? ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా... రేవంత్ రెడ్డి కోసం రాహుల్ గాంధీ దిగి వచ్చారు కదా? అని ఇంటర్వ్యూలో ఉత్తమ్ ను అడగ్గా... అబ్బే, అలాంటిదేమీ లేదు.. ఆయన కోసం రాహుల్ గాంధీ దిగిరావడం ఏమిటి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్నారు.. ఆయనకు గౌరవంగా వుంటుందని ఢిల్లీలో చేర్పించడం జరిగిందన్నారు. ఇక భవిష్యత్తులో ఆయనకు కీలక పదవి ఇస్తారటగా అంటే... రేవంత్ కూడా సముద్రంలో ఓ నీటి బిందువు వంటివారే. కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం. అందులోకి ఎవరు వచ్చినా ఓ బిందువులాంటివారే అంటూ వెళ్లిపోయారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పాదయాత్ర మొదటిరోజే అపశృతి... గుండెపోటుతో కార్యకర్త మృతి