Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీ 'Gabbar Singh Tax', మమతా బెనర్జీ 'Great Selfish Tax'

పెద్ద నోట్ల రద్దుకు వచ్చే నవంబరు 8తో సంవత్సరం కావొస్తోంది. ఈ నోట్ల రద్దుతో పలు పరిశ్రమలకు చావుదెబ్బ తగిలింది. రియల్ ఎస్టేట్ రంగం అయితే ఇప్పటికే లేవలేక మూలుగుతోంది. ఇదిలావుండగానే నరేంద్ర మోదీ సర్కార్ జిఎస్టీ, వస్తు సేవల పన్నును తీసుకొచ్చారు. ఈ పన్నుపై

రాహుల్ గాంధీ 'Gabbar Singh Tax', మమతా బెనర్జీ 'Great Selfish Tax'
, సోమవారం, 6 నవంబరు 2017 (17:43 IST)
పెద్ద నోట్ల రద్దుకు వచ్చే నవంబరు 8తో సంవత్సరం కావొస్తోంది. ఈ నోట్ల రద్దుతో పలు పరిశ్రమలకు చావుదెబ్బ తగిలింది. రియల్ ఎస్టేట్ రంగం అయితే ఇప్పటికే లేవలేక మూలుగుతోంది. ఇదిలావుండగానే నరేంద్ర మోదీ సర్కార్ జిఎస్టీ, వస్తు సేవల పన్నును తీసుకొచ్చారు. ఈ పన్నుపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో దీనిపై తీవ్రస్థాయిలో సెటైర్లు వినబడ్డాయి. ఆఖరికి విజయ్ హీరోగా మెర్సల్ చిత్రంలో జీఎస్టీపై సెటైర్లు వేశారు. 
 
ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో GST అంటే Gabbar Singh Tax అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు తాజాగా మమతా బెనర్జీ వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. GST అంటే Great Selfish Tax అంటూ ఎద్దేవా చేశారు.
 
గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ ప్రజలను ఇబ్బంది పెట్టి.. ఆర్థిక రంగాన్ని అంతం చేసే పన్ను అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగాలను లాక్కునేందుకు, వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే ఈ జీఎస్టీని విధించారని మమత ధ్వజమెత్తారు. అలాగే ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దు అమానుష‌మని, అందుకు వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 8న ప్ర‌తి ఒక్క‌రూ నిర‌స‌న తెలియ‌జేయాల‌ని మమత పిలుపునిచ్చారు. ఆ రోజున అంద‌రూ త‌మ ట్విట్ట‌ర్‌ ఖాతాలో న‌లుపు రంగును ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
 
కొత్త పన్ను విధానం జీఎస్టీ ద్వారా లక్షల మంది చిన్న వ్యాపారులు రోడ్డున్న పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా ఎదురుదాడికి దిగారు. గుజరాత్ ప్రజలకు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం కావాలని, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమీ ఇవ్వడం లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐడియా కొత్త ఆఫర్.. రూ.357 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 1జీబీ ఉచిత డేటా